మోడీ, ట్రంప్ తర్వాత జనసేన: పవన్ కళ్యాణ్

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర ఆంధ్ర ప్రాంతం లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే, ఇందులో భాగంగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. చంద్ర బాబు అతని అనుచరులకు హెచ్చరికలు జారీ చేశారు..చంద్ర బాబూ! డ్రామాలు వద్దు, రైల్వే జోన్‌కు అడ్డుపడిందే మీరేనని…మీకు ధనబలం, అంగబలం ఉంటె మా వద్ద ప్రజల గుండెచప్పుడు ఎరుపు కండువా ఉందన్నారు. టీడీపీ నేతల దోపిడీ చంద్రబాబుకు కనిపించడం లేదా అని పవన్ మండిపడ్డారు.

గత కొన్ని రోజులుగా అధికార పక్షం వారు వచ్చే ఎన్నికల్లో జనసేనకు కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి అంటున్నారు. మొదట్లో మోడీ కి కూడా 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని అతను భారత దేశ ప్రధాని అయ్యారని, అటు తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కూడా ప్రారంభంలో 10 శాతం ఓట్లే వచ్చాయని, ఇక ఇప్పుడు జనసేన కూడా అదే విధంగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఎర్పాటు చేస్తుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు పవన్. జనసైనికులందరు ఈ విషయం తెలుసుకోవాలన్నారు, ఇది తమ పార్టీ కి చక్కటి ఆరంభం అని పవన్ తెలియ చేసారు.

Share.