జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కంటి మీద కురుపు బాగా ఇబ్బంది పెట్టడంతో బుధవారం సాయంత్రం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ లో చేరిన పవన్ కళ్యాణ్ చిన్న ఆపరేషన్ తో వైద్యులు ఆ కురుపుని తొలగించడంతో గురువారం సాయత్రం పవన్ కళ్యాణ్ డిస్చార్జ్ అవడం జరిగింది.
ప్రస్తుతం పోరాట యాత్ర అంటూ సభలను నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా నల్లటి కళ్ల అద్దాలు వాడుతున్నట్తుగా మనం గమనిస్తూనే ఉన్నాం. ఆ కురుపు వల్లే పవన్ కళ్లజోడుతో కనిపిస్తున్నాడట. మొత్తానికి ఆపరేషన్ ద్వారా ఆ కురుపుని తొలగించారు. ఇక 2019 ఎన్నికలలో జనసేన గట్టి పోటీ ఇవ్వాలని చూస్తుంది. దానికి సంబందించిన కార్యచరణలు చేస్తున్నాడు.