తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు జీవితగాథతో ‘యన్.టి.ఆర్’ అనే బయోపిక్ ని చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ ఇందులో ప్రధాన పాత్రా చేయనున్నారు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా మొదట్లో కొంత మంది సీనియర్ నటీమణులని సంప్రదించగా ఇప్పటి వరకు ఎవరిని ఫైనలైజ్ చేయలేదు. ఈ సమయంలో ఈ చిత్రానికి అనుకోని కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి.
మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ పాత్రలో బాలీవుడ్ నటుడు సచిన్ కేడ్కర్ నటిస్తున్నారని చిత్ర యూనిట్ ప్రకటించగా నాదేండ్ల భాస్కర్ పెద్ద కుమారుడు తమని ఇప్పటి వరకు హీరో బాలకృష్ణ కానీ, దర్శకుడు కానీ ఎవరు సంప్రదించలేదని, తమ కుటుంబ అంగీకారం తీసుకోలేదని చెప్పారు. ఇంతటితో ఆగకుండా డైరెక్టర్ క్రిష్ కు , అలాగే హీరో బాలకృష్ణ కు కోర్టు నోటీసులు పంపినట్లు సమాచారం. నాదేండ్ల కుటుంబ సభ్యులు ఇప్పటికైనా తమకి కథ వినిపించాలని, తన తండ్రి పాత్రా గురించి పూర్తిగా వివరించాలని చిత్ర బృందాన్ని నోటీసు ద్వారా కోరారు.
కోర్టు నోటీసులు అందుకున్న బాలకృష్ణ, క్రిష్
Share.