అందరు హీరోయిన్ల లెక్క ఆమే కాదు.. ఆమేకు కొన్ని రూల్స్ ఉన్నాయి.. వాటినే ఎప్పటికి ఫాలో అవుతూ ఉంటుంది.. తనకంటూ సోషల్ మీడియా అకౌంట్లు లేవు.. ప్రచారాలకు దూరంగా ఉంటుంది.. ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు తక్కువే.. తన పనేంటో చేసుకుంటూ, ఆర్భాటాలకు, ప్రమోషన్లకు దూరంగా ఉండే ఈ దక్షిణాది తార.. ఇప్పుడు సంచలనం కలిగించే పనిచేసింది.. తాను ప్రచారాలకు ఎంత దూరం ఉంటూ తనకంటూ ఒకపద్దతిని ఏర్పర్చుకుంది ఈ భామ…
కానీ ఎందుకో ఏమో ఇప్పుడు సడన్‌గా తన రూల్స్‌ను తానే బ్రేక్ చేసుకుంది.. తన రూల్స్‌ను బ్రేక్ చేయడమంటే అట్లాంటి ఇట్లాంటి బ్రేక్ కాదు.. మ్యాగజైన్‌కు ప్రత్యేకంగా ఫోటోకు ఫోజు ఇచ్చి అందరిని విస్మయానికి గురి చేసింది.. ఇంతకు ఎవరా భామ అనుకుంటున్నారా.. మనందరికి తెలిసిన ఈ తారే.. ఆమే నయనతార.. నయనతార తన రూల్స్‌ను బ్రేక్ చేసిందా అంటే అందరు టక్కున ముక్కున వేలేసుకుంటారు.. కానీ ఇది నమ్మలేని నిజం..
మెగాస్టార్ చిరంజీవితో సైరా చిత్రంలో నటించిన నయనతార కనీసం సినిమా ప్రమోషన్లలో ఎక్కడా పాల్గొనలేదు. కనీసం ప్రెస్‌మీట్లకు కూడా చిత్ర యూనిట్‌తో కలువలేదు. అట్లాంటి నయనతార ఇప్పుడు ఏకంగా వోగ్ ఇండియా కవర్ పేజీ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ మ్యాగజైన్ ఏకంగా ముఖచిత్రంలో నయనతార మతిపోగొట్టే ఫోటోను ముద్రించింది.. అంతే కాదు.. నయనతారతో పాటుగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు, బాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ ఫోటోలను ముద్రించింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌ఛల్ చేస్తున్నాయి..