యాక్ష‌న్ హీరోకు అమ్మాయిలంటే సిగ్గ‌ట‌..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అర‌డుగుల క‌న్నా ఎక్కువ పొడ‌గ‌రి.. బాడీ చూస్తే కండ‌లు తిరిగి వీరుడిలాగా ఉంటాడు.. గ‌డ్డం పెంచాడంటే విల‌న్ క‌న్నా ఫ‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపిస్తాడు.. యాక్ష‌న్ సినిమాలంటే బాగా ఇష్టమ‌ట‌.. కానీ ఎందుకో అమ్మాయిలంటే మాత్రం తెగ సిగ్గుప‌డి పోతాడ‌ట‌.. ఇంత‌కు అర‌డుగుల ఆజానుబాహుడు అమ్మాయిలంటే ఎందుకో సిగ్గు.. ఇంత‌కు ఎవ్వ‌రా హీరో అనుకుంటున్నారా.. మీరే చూడండి…

యాక్ష‌న్ హీరో గోపీచంద్‌. యాక్ష‌న్ సినిమాకు ప్రాధాన్య‌త ఇస్తూ యాక్ష‌న్ సినిమాల హీరోగానే టాలీవుడ్‌లో, అభిమానుల్లో పేరు సంపాదించుకున్నాడు. విల‌న్‌గా సిని కేరీర్‌ను ప్రారంభించిన ఈ హీరో చూస్తే జెంటిల్‌మెన్‌గా క‌నిపిస్తాడు.. కానీ ఎందుకో అమ్మాయిల‌తో మాట్లాడాలంటే చాలా సిగ్గ‌ట‌.. కానీ తెర‌మీద రోమాన్స్ మాత్రం అమ్మాయిల‌తో బాగానే చేస్తాడ‌ట‌.. ఆన్‌స్క్రీన్‌లో ఎలాంటి సిగ్గు ఉండ‌దు.. కానీ ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం చాలా దూరంగా ఉంటాడ‌ట‌. ఎవ్వ‌రితో మాట్లాడ‌ట‌..

ఈరోజు గోపీచంద్ న‌టించిన చాణ‌క్య సినిమా విడుద‌ల అయింది. అయితే ఈసినిమా ఇప్పుడు థియోట‌ర్ల‌లో హంగామా చేస్తుంది. ఓ సీక్రేట్ ఏజెంట్‌గా న‌టిస్తున్న గోపీచంద్ కేరీర్‌కు ఈ సినిమా బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే టాక్ ఉంది. అయితే చాణ‌క్య సినిమా మాంచి కంటెంట్ ఉండ‌టంతో ప్రేక్ష‌కులు బాగానే ఆద‌రించే అవ‌కాశాలు లేకపోలేదు. ప్రిమియ‌ర్ షో టాక్ కూడా బాగానే ఉన్న నేప‌థ్యంలో గోపీచంద్‌కు ఈ సినిమా ప్ల‌స్ కానున్న‌ది.

Share.