నాగచైతన్య థాంక్యూ సినిమా..ott విడుదల పై క్లారిటీ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లవ్ స్టోరీ. ఈ ఏడాది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా షూటింగ్ లో జరుగుతుండగానే.. మరొక సినిమాను కూడా స్టార్ట్ చేశాడు నాగ చైతన్య. ఆ సినిమానే థాంక్యూ ది మూవీ.. అయితే ఈ చిత్రంపై తాజాగా వచ్చిన ఒక విషయంపై చిత్ర యూనిట్.. చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వడం జరిగింది.

డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇదివరకే ఈ డైరెక్టర్ తో కలిసి మనం సినిమాలో నటించారు. అయితే థాంక్యూ సినిమాని ఓటీటీ లోనే విడుదల చేస్తారా అంటూ ఒక టాక్ రావడంతో.. ఈ విషయం చిత్ర యూనిట్ సభ్యులకు తెలియగా దీనిపై అధికారికంగా ఒక స్పష్టమైన క్లారిటీ అందించారు. ఈ సినిమా ఇప్పుడు ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నది.. ఈ సినిమాని బిగ్ స్క్రీన్ కోసం మాత్రమే తీశామని.. సో సరైన సమయంలో థియేటర్లోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నామని ఒక క్లారిటీ తో తెలియజేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ కూడా వైరల్ అవుతోంది.

Share.