పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన్నప్పటి నుండి మౌనం గా ఉన్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఒకరి తరువాత ఒకరు పవన్ కి మద్దతు పలుకుతూ వస్తున్నారు. మొన్న సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ వచ్చే ఎన్నికల్లో జనసేనకే తమ మద్దతని, కళ్యాణ్ గారు ఎప్పుడు పిలిచి ప్రచారం చేయమన్న తాము సిద్ధమని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మెగా నిర్మాత అల్లు అరవింద్ కూడా మొన్న ఫిలిం ఛాంబర్ లో పవన్ కి సపోర్ట్ గ మాట్లాడిన విషయం అందరికి తెలుసు.
ఇప్పుడిక మెగాస్టార్ వంతు వచ్చిందనే చెప్పాలి. మొదటి నుండి చిరంజీవి వెంటనే ఉంటూ, చిరు నమ్మిన బంటు గా పేరు తెచ్చుకున్న చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడు ఇప్పుడు అధికారికంగా ఈ నెల 9 వ తేదీన ‘జనసేన’ లో చేరుతున్నట్టు ప్రకటించారు. చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు నాయుడు కూడా కేవలం సినిమా ప్రపంచానికి పరిమితమయ్యారు. ఎప్పుడైతే ప్రజారాజ్యం ఏర్పాటైందో వెంటనే నాయుడు కూడా ప్రజారాజ్యంలో చేరారు. అటు తర్వాత నాయుడు కూడా కాంగ్రెస్ లో చేరి తర్వాత రాజీనామా చేసారు. ఇప్పుడు తనతో పాటు చిరంజీవి అభిమాన సంఘాల సభ్యులు కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు. సాధారణంగా స్వామి నాయుడు చిరు అంగీకారం లేనిదే ఏ పని చేయరు, కావున ఇప్పుడు నాయుడు జనసేన లో చేరటం వెనుక చిరు మద్దతు ఉందని తెలుస్తుంది. ఇక చిరంజీవి కూడా ఇండైరెక్ట్ గా తన తమ్ముడు పార్టీ కి మద్దతు పలికినట్లే అని తెలుస్తుంది. మరి వచ్చే ఎన్నికల్లో చిరంజీవి పవన్ తరుపున ప్రచారం చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. మెగా ఫ్యామిలీ సపోర్ట్ పవన్ కి ఎంత వరకు కలిసి వస్తుందో కొద్దీ రోజుల్లో తెలుస్తుంది.