సాహో క్లైమాక్స్ ఖ‌రీదు ఎన్ని కోట్లో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హైవోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సాహో. రూ.300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో యూవీ క్రియేష‌న్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాకు సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న సాహో తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ఆగస్టు 30న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ.300 కోట్లు అయితే అందులో సింహ‌భాగం ఖ‌ర్చు యాక్ష‌న్ పార్ట్‌కే పెడుతున్నారు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ సీన్‌కే రూ.40 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని వ‌చ్చిన వార్త‌ల‌కే యాక్ష‌న్ ప్రియుల‌కు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ కోసం రూ.70 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తోంది.

హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ హెల్ బాయ్ ఫేమ్ పెంగ్ జాంగ్ కంపోజ్ చేసిన ఈ ఫైట్‌కు రూ.70 కోట్లు అయ్యింద‌ట‌. క్లైమాక్స్‌లో 15 నిమిషాల పాటు వ‌చ్చే ఈ ఫైట్‌లో ప్ర‌తి షాట్‌ను క‌ళ్లార్ప‌కుండా చూసేలా ఎంజాయ్ చేయ‌వ‌చ్చ‌ని మేకర్స్ చెపుతున్నారు. 15 నిమిషాల కోసం రూ.70 కోట్ల ఖర్చు అంటే విజువ‌ల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మొత్తానికి సాహో యాక్ష‌న్ ప్రియుల‌కు క‌నెక్ట్ అయితే ఒక్కొక్క‌రు ప‌దే ప‌దే చూసి రికార్డులు బ‌ద్ద‌లు కొట్టించ‌డం ఖాయం.

Share.