ఏమాయ చేసావే సినిమాతో తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇంకా తన మొదటి సినిమాతోనే కుర్రకారులను ఆమె వలలో పడేలా చేసుకుంది. ఇక ఈ సినిమాతో నాగచైతన్య సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఆ తర్వాతే నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకుంది. అలా నాలుగు సంవత్సరాల తర్వాత తామిద్దరం విడిపోతున్నాం అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.
ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం సమంత ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంటుంది. విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియా లో ఏ పోస్టు పెడితే ఆ పోస్టులు పెడుతూ వైరల్ గా మారుతుంది.
అప్పుడప్పుడు తన అమ్మ చెప్పింది అంటూ ఏవేవో కొటేషన్లు పెట్టేది. ఇక విడాకులు అనంతరం రెండు సినిమాలలో నటిస్తున్నట్లుగా తెలియజేసింది.
ఇక హాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు గా కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె సమంత శాకుంతలం సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్నది.. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఇందులో అల్లు అర్జున్ కూతురు కూడా బాలనటిగా నటించిన ట్లు తెలుస్తోంది