పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ లో చాల బిజీగా ఉన్నారు. ఈ మూవీ లో పవన్ కల్యాణ్ సరసన నిత్యమీనన్, రానా మరొక కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే క్రిస్మస్ సందర్భంగా పవన్ తన భార్య వద్దకు రష్యాకు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అక్కడే న్యూ ఇయర్ వేడుకలు కూడా జరుపుకోనున్నట్లు సమాచారం. అయితే సెలబ్రేషన్స్ అయ్యాక తిరిగి ఇండియాకు వచ్చి పవన్ కల్యాణ్ మళ్ళీ తన తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇక దీంతో పాటుగా మళ్ళీ ఒక సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా నిర్వహించనున్నట్లు గా బాగా టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ నిర్మాతగా సినిమాలు తీయాలంటే చాలా ఇష్టం అందుకే ఈ ఏడాది పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది