సౌత్ లో మహేష్ తర్వాతే ఎవరైనా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ సౌత్ ఇండస్ట్రీలో మరోసారి సత్తా చాటుకున్నాడు. కేవలం తెలుగు సినిమాలే చేసినా సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో మహేష్ నెంబర్ 1 గా నిలిచాడు. అదెలా అంటే మహేష్ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఏకంగా 13 మిలియన్స్ కు చేరడం విశేషం. ట్విట్టర్ లో 6.6 మిలియన్స్, ఫేస్ బుక్ లో 5.1 ఇంకా ఇన్ స్టాగ్రాంలో 1.4 మిలియన్ ఫాలోవర్స్ మహేష్ కు ఉన్నారు.

ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ సౌత్ లో మహేష్ మాత్రమే. 13 మిలియన్ ఫ్యాన్స్ తో మహేష్ మరోసారి సౌత్ లో తన క్రేజ్ ఏంటన్నది చూపించాడు. ఇక సినిమాల విషయానికొస్తే భరత్ అనే నేను హిట్ తో మళ్లీ జోష్ పెంచుకున్న మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో 25వ సినిమా చేస్తున్నాడు.

దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టైటిల్ గా రాజసం ప్రచారంలో ఉంది. 2019 ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Share.