సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆయన సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే.. తన మోకాలు కి నొప్పి అధికమవడంతో సర్జరీ కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం అందించారు.. అయితే అందుకోసమే ఆయన సినిమా చివరి దశలో ఉన్నప్పటికీ షూటింగ్ ఆపుకొని మరి మోకాలు సర్జరీ చేయించు కోవడానికి స్పెయిన్ కు వెళ్లారు. తాజాగా స్పెయిన్ లో మహేష్ బాబుకు సర్జరీ పూర్తి అయినట్లు తెలుస్తోంది.. ఇకపోతే మహేష్ బాబు అక్కడినుంచి దుబాయ్ కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారని తాజాగా నివేదికలో వెల్లడించడం జరిగింది..
నిజానికి గత కొన్ని నెలల నుంచి ఆయన మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకోసమే హైదరాబాదులో ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నారట.. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మోకాలు కి చిన్న గాయం తగలడంతో శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సలహా ఇచ్చారట . అందుకే సోమవారం ఆయన స్పెయిన్ కి వెళ్లి సక్సెస్ ఫుల్ గా మోకాలుకు సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ని దుబాయ్ కి వెళ్లి రెస్ట్ తీసుకోనున్నారు. ఇక అంతే కాదు క్రిస్మస్ , న్యూ ఇయర్ వేడుకలను ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి దుబాయ్ లోనే జరుపుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనతో ఆయన సతీమణి నమ్రత వెంట ఉండగా.. డిసెంబర్ 24వ తేదీన పిల్లలు గౌతమ్ , సితార కూడా దుబాయ్ కి వెళ్తున్న ట్లు సమాచారం.