సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2020 జనవరి 11న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ రోల్ లో చేస్తున్నాడని తెలిసిందే.
ఇక సినిమాలో బోర్డర్ దగ్గర పాకిస్థాన్ కుక్కల్ని ఏరిపారేశా.. బోల్డర్ లోపల మీ లాంటి పందికొక్కుల్ని నరిపారేస్తా అంటూ ఓ ఊర మాస్ డైలాగ్ చెబుతాడట. ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో మహేష్ మరోసారి తన నట విశ్వరూపంతో అలరిస్తాడని తెలుస్తుంది. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవై 5న ఎల్బి స్టేడియంలో ప్లాన్ చేశారు.
భరత్ అనే నేను, మహర్షి సినిమాల సక్సెస్ తో ఫుల్ ఫాంలో ఉన్న మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు చేసిన నాలుగు సినిమాలు హిట్ అందుకున్న అనీల్ రావిపుడి సరిలేరు నీకెవ్వరుతో కూడా సూపర్ హిట్ పై కన్నేశాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.