సూపర్ స్టార్ మహేశ్‌బాబు ప్రజెంట్ వెకేషన్‌లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. గోవాలో ఓ వైపు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే, మరో వైపు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నాడు మహేశ్. ఈ హ్యాపీ ట్రిప్‌లో మహేశ్, ఆయన వైఫ్ నమ్రత, వైఫ్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ పిల్లలు ఉన్నారు. ఈ ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
ఇక కుటుంబ సభ్యులందరూ చార్టర్ట్ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లినట్లు సమచారం. ఈ క్రమంలో నాన్నతో జర్నీ ఎంతో ఉత్సాహంగా ఉంటుందని, కేక్స్‌తో పాటు అద్భుతమై గూడీస్ పొందొచ్చని మహేశ్ డాటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం టీజర్ మహేశ్ బర్త్ డే సందర్భంగా విడుదలయింది. టీజర్ చూసి సినీ లవర్స్, మహేశ్ ఫ్యాన్స్ హిట్ గ్యారంటీ అని చర్చించుకుంటున్నారు.
సంక్రాంతి కానుకగా విడుదల కాబోయే ఈ చిత్రంలో మహేశ్ సరసన క్యూట్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది.