తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ ఒక ట్రెండ్ సెంటర్ అని చెప్పవచ్చు. శివ సినిమాతో తెలుగు సినిమా చరిత్రనే మార్చాడని చెప్పవచ్చు. ఇక ఆ తరువాత విభిన్నమైన కథలతో ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ తో స్టార్ హీరోలు సైతం సినిమా తీసేందుకు చాలా ఆత్రుతగా ఉండేవారు.. కానీ ఇప్పుడు వర్మ ని అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. దాంతో ఏవేవో సినిమాలు చేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడు వివాదాస్పద, వాక్యాలతో ముందంజలో ఉంటాడు.
అయితే ఇప్పుడు తాజాగా కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేశాడు. వర్మ ఇప్పుడే కాకుండా గతంలో కూడా ఉదయాన్నే లేచి నేను పోర్న్ సినిమాలు చూస్తా అని చెప్పి అందరికీ షాకిచ్చాడు. అవి చూస్తేనే నా మైండ్ రిలీఫ్ అవుతుందని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రేమ, సెక్స్ కు సంబంధించి కొన్ని బోల్డ్ కామెంట్లు చేశారు. ప్రేమ , సెక్స్ ని కెమిస్ట్రీ, ఫిజిక్స్ తో ముడి పెట్టారు.. ప్రేమ అనేది కెమిస్ట్రీకి సంబంధించినదని, కానీ సెక్స్ ఫిజిక్స్ కి సంబంధించినది అని తెలియజేశాడు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ నుంచి వైరల్ గా మారుతోంది.
Love is about chemistry , but sex is physics
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2021