మురుగదాస్ పై ఫైర్ అవుతున్న లేడీ సూపర్ స్టార్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సౌత్ లో స్టార్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న మురుగదాస్ బాలీవుడ్ లో కూడా తన సినిమాలతో రికార్డులు కొల్లగొట్టాడు. తెలుగు, తమిళ, హింది భాషల్లో సినిమాలు చేసిన మురుగదాస్ మీద ఇంతరకు ఎవరు విమర్శలు చేయలేదు కాని తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం అతని మీద ఫైర్ అవుతుంది. దశాబ్ధం తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చిన నయనతార మురుగదాస్ డైరక్షన్ లో వచ్చిన గజిని సినిమా మీద విమర్శలు చేసింది.

ఆ సినిమాలో తన పాత్ర తనకు కథ చెప్పినప్పుడు ఒకళా చెప్పి సినిమాలో మరోలా చూపించారని అన్నది నయనతార. ఆ సినిమాలో నటించి తప్పు చేశానని చెప్పుకొచ్చింది నయనతార. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రస్తుతం నయనతార మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న దర్బార్ సినిమాలో నటిస్తుంది. సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.

నయనతారకు దర్భార్ సినిమా విషయంలో ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వలేదు కాబట్టే డైరక్టర్ మురుగదాస్ మీద్ ఆమె ఇలా కామెంట్స్ చేసిందని కోలీవుడ్ మీడియా చెబుతుంది. రీసెంట్ గా సైరా సినిమాలో నటించిన నయనతార విజయ్ విజిల్ సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది.

Share.