టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. 2016వ సంవత్సరంలో” ఆ ” సినిమాతో దర్శకుడిగా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత కల్కి వంటి సినిమా కూడా తెరకెక్కించారు. కానీ ఇవన్నీ పెద్దగా ఆడలేదు.. ఆ తర్వాత జామి రెడ్డి సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా హనుమాన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా వస్తున్నాయి సినిమాలు తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది. ఇందులో ఆమె మీనాక్షి అనే పాత్రలో పోషిస్తున్నట్లు గా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగిందట. ఈ అమృత అయ్యర్ ఎవరో కాదు యాంకర్ ప్రదీప్ తో కలిసి “30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా”అనే సినిమాలో నటించిన హీరోయిన్. ఇక ఆ తరువాత హనుమాన్ మూవీ తో పాటు.. అర్జునా.. పాల్గుణ అనే సినిమాలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇలా వరుస ఆఫర్లతో సంపాదించుకుంటోంది.