బాహుబలిని మించిన కురుక్షేత్రం ట్రైలర్

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి చిత్రం విజయవంతం అయిన తరువాత అంతా జానపద పౌరాణిక చిత్రాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు దర్శక నిర్మాతలు భారీ వసూళ్ళను రాబట్టాలంటే జానపద పౌరాణిక చిత్రాలే బాగుంటాయనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ ,కన్నడం అనే తేడా లేకుండా భారీ పౌరాణిక కథ చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు అదే కోవలోకి వస్తుంది కురుక్షేత్రం. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.

సౌత్ ఇండియా సెన్సెషనల్ ప్రోడ్యూసర్ గా పేరుగాంచిన రాక్ లైన్ వెంకటేష్ సమర్పణలో వృషభాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై మునిరత్న నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నాగన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను బుధవారం రిలీజ్ చేశారు. భారీ తారగణం, సెట్స్, గ్రాఫిక్స్ రూపొందించారు. ఈ చిత్రం ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేస్తుండటం విశేషం. 3డి వెర్షన్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం ట్రైలర్ చూస్తే నాటి మహాభారత సంగ్రామం గుర్తుకు వస్తుంది. తెలుగు ట్రైలర్ ను హైదరబాద్ లో ప్రముఖ నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్, బన్నీవాసులు విడుదల చేశారు.

కురుక్షేత్ర సంగ్రామానికి భీజం వేసిన ఘటనల నేపథ్యంలో ఈ ట్రైలర్ ను రూపొందించారు. దివంగత నటుడు అంభరీష్ భీష్ముడిగా నటించిన ఈ సినిమాలో దర‍్షన్ దుర్యోధనుడిగా కనిపించాడు. కర్ణుడిగా అర్జున్, ధర్మరాజుగా శశి కుమార్, ద్రౌపదిగా స్నేహా, అర్జునుడిగా సోనూసూద్, అభిమన్యుడిగా నిఖిల్, శకునిగా రవికుమార్, కృష్ణుడిగా రవిచంద్రన్లు నటించారు. ఈ సినిమాను ఇండియా మొత్తం దాదాపు ఐదు భాషల్లో విడుదల చేస్తుండటంతో చిత్రయూనిట్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుంది.

Share.