మోడీ తో కెటీఆర్ భేటీ..ఆ అంశాలపైనే ప్రధాన చర్చ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీ కెటీఆర్ ఇవాళ మధ్యాహ్నం దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని కొద్దీ సేపటి క్రితం కలిశారు. వీరి కలయిక రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని నెలలుగా కెసిఆర్ మూడో ఫ్రంట్ స్థాపిస్తారని దానికి కెసిఆరె అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారని జాతీయ మీడియా లో వార్తలు వస్తూనే ఉన్నాయ్. ఈ నేపథ్యంలో అయన తనయుడు కెటీఆర్ మోడీ ని కలవటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే వీరిద్దరి సమావేశం కావటానికి ముఖ్య కారణం గతంలో కేంద్రం తెలంగాణ కి మంజూరు చేసిన పలు ప్రాజెక్ట్స్ పైనే జరిగిందని సమాచారం.

ఇందులో ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బయ్యారం(ఖమ్మం జిల్లా) స్టీల్ ప్లాంట్ కాగా మరొకటి హైదరాబాద్ లో నిర్మించవలసిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అని కెటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎన్నోఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్స్ ని త్వరగా పూర్తి చేయాలనీ కెటీఆర్ ప్రధాని మోడీ ని కోరారని సమాచారం.

Share.