‘ ఖైదీ ‘ 2 వారాల క‌లెక్ష‌న్స్‌… కార్తీ కెరీర్ రికార్డు..

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ ఖైదీ మూవీ తెలుగులో కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. తెలుగులో ఖాకీ, ఊప‌రి సినిమాల త‌ర్వాత స‌రైన హిట్ లేక డీలా ప‌డ్డ కార్తీకి ఖైదీ సినిమా మంచి జోష్ ఇచ్చింది. దీపావ‌ళి కానుక‌గా మ‌రో కోలీవుడ్ క్రేజీ హీరో విజ‌య్ విజిల్ (తెలుగులో బిగిల్‌)కు పోటీగా వ‌చ్చిన ఈ సినిమా విజిల్ క‌న్నా ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. విజిల్ తెలుగులో బ్రేక్ ఈవెన్ అయ్యేందుకే ఆప‌సోపాలు ప‌డితే ఖైదీ భారీ లాభాలు సాధించింది.

ఖైదీ రిలీజ్ అయ్యి ఇప్ప‌టికే రెండు వారాలు అయినా ఈ సినిమా జోరు మాత్రం ఆగ‌లేదు. కమర్షియల్ అంశాలు లేకుండా కేవలం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఖైదీ చిత్రం తెలుగులో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాను ఇక్క‌డ కేవ‌లం రు 2.5 కోట్ల‌కు కొని రిలీజ్ చేశారు. సినిమాలో కార్తీ రా అండ్ ర‌ఫ్ లుక్ నేచుర‌ల్ యాక్టింగ్ సినిమాకే హైలెట్ అయ్యింది.

ఖైదీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 12.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఖైదీ తెలుగులో కార్తీ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. విలక్షణ దర్శకుడు కార్తీక్ లోకేష్ కనకరాజ్ కేవలం చీకటి నేపథ్యంలో నడిచే ప్రయోగాత్మక కథగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ వారం కూడా తెలుగులో బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాల విడుదల లేకపోవడంతో మరికొన్ని మెరుగైన వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

Share.