బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కత్రినాకైఫ్ సహనటుడు విక్కీ కౌశల్ ను డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇక మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విక్కీ కౌశల్ , కత్రినాకైఫ్ తమ పెళ్లికి సంబంధించి ఎన్నో విషయాలను చాలా జాగ్రత్తగా అమలుపరిచినట్లు సమాచారం. వీరికి సంబంధించిన ఫోటోలను కానీ పెళ్లి వీడియోలను కానీ ఇప్పటివరకు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు..అయితే వీరి ఫోటోలను , వీడియోలను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఏకంగా 80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని సమాచారం.
ఇక పోతే వీరి పెళ్లికి కొంతమంది మాత్రమే హాజరైన విషయం తెలిసిందే. అయితే ఇక హాజరైన ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ గా నేతి తో తయారుచేసిన లడ్డూలను , ఒక లెటర్ ను గిఫ్ట్ బాక్స్ లో పెట్టి ఇచ్చారు కత్రినా – విక్కీ దంపతులు. ఇకపోతే వీరి పెళ్లికి హాజరైన సెలబ్రిటీలు ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే బహుమతులు ఇవ్వడం గమనార్హం . ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ కూడా కత్రినాకైఫ్ కు మూడు కోట్ల రూపాయల విలువ చేసే రేంజ్ రోవర్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై ఉన్న అభిమానం కారణంగా ఆమె పెళ్ళికి ఇలాంటి ఖరీదైన వస్తువులు బహుమతిగా ఇచ్చాడు సల్మాన్ ఖాన్.