ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై ఈ రోజు హైదరాబాద్ పోలీసులు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. కత్తి మహేష్‌ను హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. కత్తి మహేష్ ని ఆరు నెలల పటు హైదరాబాద్ నుండి బహిష్కరించాం అని డీజీపీ తెలిపారు. అనుమతి లేకుండా నగరానికి వస్తే మూడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు.
మత విద్వేషాలు రెచ్చకొడుతూ శ్రీ రాముని పై అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అతని శిక్షకు కారణమని, సీటీ పోలీస్ యాక్ట్, నేరగాళ్ల నియంత్రణ చట్టం ప్రకారమే కత్తిపై ఈ విధమైన బహిష్కరణ విధించాం అని మహేందర్ రెడ్డి మీడియా కి తెలిపారు. అదే విధంగా కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ వారు ఇటువంటి వారిని పదే పదే పిలిచి డిబేట్స్ వంటివి ఇక పై చేయకుండా న్యూస్ ఛానల్స్ కి కూడా నోటీసులు పంపమని డిజీపి ప్రకటించారు. కత్తి మహేష్ ను చిత్తూరు జిల్లాలో వదిలేశామని, ఈ విషయం పై ఆంధ్ర ప్రదేశ్ పోలీసులతో కూడా చర్చించామని తెలిపారు మహేందర్ రెడ్డి.