ఎలాంటి పాత్రలో అయినా సరే అవలీలగా పరకాయ ప్రవేశం చేయడం… జూనియర్ ఎన్టీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. దర్శకుడు నీ పాత్ర ఇలా ఉంటుంది అనగానే ఆ పాత్ర కోసం ఏ కష్టం అయినా సరే పడటానికి తారక్ సిద్దంగా ఉంటాడు. దర్శకుడు నాకు నీ నుంచి ఇది కావాలి అనగానే దాన్ని ఇవ్వడానికి సిద్దంగా ఉండే నటుడు తారక్. దీనితో దర్శకులు తారక్ కోసం ప్రత్యేక పాత్రలు కూడా సిద్దం చేస్తూ ఉంటారు. జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో తారక్ ఒదిగిపోయిన విధానం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
విలన్ గా కూడా జూనియర్ ఆ సినిమాలో మెప్పించాడు… తన హావ భావాలు, తన నటన, తన డైలాగులు ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఎంతగానో మెప్పించాయి. దీనితో తారక్ అప్పటి నుంచి విలన్ పాత్రలు కూడా చెయ్యాలని, మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యాలి అనే డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది. టాలివుడ్ అగ్రధర్శకులు కొందరు తారక్ తో నెగటివ్ రోల్స్ చేయించడానికి కూడా సిద్డంయ్యారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. ప్రస్తుతం… ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తారక్ పాత్ర నెగటివ్ గానే ఉంటుంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే… ఇప్పుడు తారక్ తో నెగటివ్ రోల్ చేయించడానికి బాలివుడ్ దర్శకులు కూడా సిద్దమవుతున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. ఇటీవల కరణ్ జోహార్ హైదరాబాద్ వచ్చి తారక్ ని కలిసినట్టు సమాచారం. తాను త్వరలోనే ఒక సినిమా చేస్తున్నా అని అందులో నెగటివ్ రోల్ ఉంటుందని, ఒకరకంగా విలన్ కన్నా భయంకరమైన పాత్ర అంటూ చెప్పారట. దీనికి తారక్ కూడా తనకు కొంత సమయం కావాలని… త్వరలోనే చెప్తాను అని చెప్పాడట… మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి.