ఆరేంజ్ పాపది పెద్ద మనస్సే…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆరేంజ్ పాప గుర్తుందా… ఆ ఏమి గుర్తుంటుంది… బొమ్మరిల్లు పాపంటే గుర్తుకొస్తుంది కాబోలు… అయితే ఆ బొమ్మరిల్లు బేబి ఇప్పుడు పెద్ద మనస్సు చేసుకుంది. ఆడుతూ పాడుతూ అందరితో కలుపుగోలుగా ఉండే ఈ బొమ్మరిల్లు బేబి మనల్ని వదిలేసి పోయింది… అదేనండీ వదిలేసి పోవడం అంటే ఎంటో పోవడం కాదు… పెండ్లి చేసుకుని ఏంచక్కా సంసార సాగరంలోకి వెళ్ళిపోయింది… ఆరేంజ్ బేబీ.. ఇంతకు ఈ ఆరేంజ్ అమ్మాయి ఎవరనే కదా అదేనండ జెనిలియా..

తెలుగులో బొమ్మరిల్లు, సై, సాంబ, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ తో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది జెనిలియా. చివరగా ఆరేంజ్ సినిమాలో మెగా పవర్స్టార్ రామ్చరణ్ తేజ్ సరసన నటించి సినిమాలకు వీడ్కోలు పలికింది. ముంబాయికి చెందిన రితేష్ దేశముఖ్ని 2012లో పెండ్లి చేసుకుని ముంబాయి చెక్కేసింది. ఇప్పుడు జెనిలియాకు ఇద్దరు కొడుకులు రియాన్, రహీల్. కుటుంబంతో హ్యీపీగా ఉంది.

అయితే ఇటీవల మహారాష్ట్రలో వచ్చిన వరదలతో ముంబాయి నగరం అతలాకుతలం అయింది. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. కోట్లాది రూపాయల ఆస్తులు నష్టం జరిగింది. వరదలతో ముంబాయి అంతా కకావికలం కావడంతో చలించిన జెనిలియా తన భర్త రితేష్ దేశ్ముఖ్తో సీఎం దేవేంద్ర పడ్నవీస్ను కలిసి రూ.25లక్షల సహాయం చేశారు. ఈసందర్భంగా సీఎం రిలిఫ్ పండ్కు చెక్ను అందజేసిన జెలినియా, రితేష్ దంపతులకు సీఎం దేవేంద్ర పడ్నవీస్ ట్వీట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు.

Share.