ఒకప్పుడు హీరోగా తన సత్తా చాటిన జగపతిబాబు ప్రస్తుతం హీరోగా అవకాశాలు లేకపోవడంతో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుతున్నారు. లెజెండ్ సినిమాతో మొదటిసారి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన జగపతిబాబు అతి తక్కువ సమయంలోనే విలన్గా స్టార్ హోదాను అందుకున్నారు. కెరియర్ పరంగా ప్రస్తుతం ప్రతి సినిమాతో ఎదుగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ జగపతిబాబు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తన వ్యక్తిగత జీవితానికి సినీ జీవితానికి సంబంధించిన విషయాలను తెలియజేయడం జరిగింది.
కెరియర్ మొదట్లో ఒక నిర్మాతను తాను కొట్టానని తెలిపారు. ఒక హీరోయిన్ విషయంలో నిర్మాత తప్పు చేస్తే నిర్మాతను కొట్టానని ఆ నిర్మాత ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఉన్నారని తెలిపారు జగపతిబాబు. అవకాశాల కోసం మనసు చంపుకోవద్దని తెలిపారు. సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలనీ ఉందని కూడా తెలియజేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలో ఇతర పాత్రలు కూడా బలమైన పాత్రలు ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలియజేశారు. కొన్ని సినిమాలలో ఇతర పాత్రలు బాగుంటే సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకుంటాయి.
సర్కార్ సలహాలు ఉండే సినిమాలు నటించాలని ఎప్పటికైనా నటిస్తానని తెలిపారు తనకు మంచి అల్లుడు దొరికాడని నా అల్లుడు కూతురుని బాగా చూసుకుంటున్నట్లుగా తెలియజేశారు.లైఫ్ లో ఏం కావాలనే ప్రశ్న నాకు కావాల్సిన వాళ్లంతా బ్రతికి ఉండాలని కామెంట్లు చేయడం జరిగింది. మొదటి ఇన్నింగ్స్ కంటే సెకండ్ ఇన్నింగ్స్ లోనే జగపతిబాబు బాగుందన్నట్లుగా తెలియజేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఊహించని విధంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం జగపతిబాబు చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.