టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా పలు సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు పొందారు వీకే నరేష్.. అలాగే ఏన్నో సినిమాలలో నటించి మంచి పేరును కూడా సంపాదించుకున్నారు. ప్రస్తుతం పలు క్యారెక్టర్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు నరేష్. నరేష్ పవిత్ర లోకేష్ ని నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే విషయంతో చాలా పాపులర్ అయ్యారు.. నరేష్ ,పవిత్ర లోకేష్ మధ్యలో ఏదో జరుగుతోందని ఒకప్పుడు మీడియాలో టాక్ వినిపించింది. కానీ మా ఇద్దరి మధ్య ఏమీ లేదంటూ కొట్టిపడేసి ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు. ఆమెతోనే సహజీవనం చేస్తూ ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నట్లు.. ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ఒకప్పుడు నరేష్ పెళ్లి జోలికే పోను అనేవాడు కానీ ఇప్పుడు నాలుగో పెళ్లికి ఎలా రెడీ అవుతున్నాడో పలు రకాలుగా కామెంట్లు వినిపించాయి. నరేష్ కే కాకుండా అటు పవిత్రకు కూడా ఇది నాలుగో పెళ్లి అన్నట్లుగా సమాచారం. వీరిద్దరి పెళ్లి కథ పక్కన పెడితే తన మూడో భార్య పరిస్థితి ఏంటి?వీరిద్దరూ బాగానే పెళ్లి చేసుకుంటున్నారు కానీ నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి పరిస్థితి ఏంటి తనకి విడాకులు ఇచ్చేసారా ? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎవరైనా సరే విడాకులు తీసుకుంటే భార్యకి భర్త భరణం చెల్లించాలి. ఈ టైంలో నరేష్ తన మూడో భార్యకి ఎంత భరణం చెల్లించాడు. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.
ఇండస్ట్రీలో కొంతమంది వర్గాల నుంచి వచ్చే సమాచారం ప్రకారం తన మూడో భార్యకి నరేష్ రూ.15 కోట్లు భరణం చెల్లించారని టాక్ ఇద్దరు కుటుంబాలకు సంబంధించి లాయర్ల సమక్షంలో ఈ నిర్ణయం జరిగిందని సమాచారం. ఇక నరేష్, పవిత్రని పెళ్లి చేసుకోవడమే పెద్ద విశేషం. అది కూడా నాలుగో పెళ్లి అది కూడా సైలెంట్ గా కాకుండా. ఈ వయసులో కూడా ఒక రొమాంటిక్ సీన్ ని షూట్ చేసి ఆ వీడియోని విడుదల చేసి వివాహం చేసుకుంటున్నాం అంటూ ప్రకటిస్తున్నారు.