నిన్నటి రోజున ఒక దిగ్గజ గేయరచయిత అయినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడం జరిగింది. అయితే కొద్ది గంటల క్రితమే ఆయన మృతదేహాన్ని సినీ ఫిలిం ఛాంబర్ కి తరలించడం జరిగింది. ఇక ఈ రోజు మధ్యాహ్నం 1:00 సమయానికి.. ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు గా కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. జూబ్లీహిల్స్ లో మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈయన మృతదేహాన్ని హిందూ సాంప్రదాయ పధ్ధతిలోనే అంత్యక్రియలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. సీతారామ శాస్త్రి అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని ఫిలిం ఛాంబర్ నుండి మహా ప్రస్థానం వరకు కొనసాగించనున్నారు. ఇక ఈ అంతిమయాత్రలో ప్రముఖ సిని సెలబ్రెటీలతో పాటు అభిమానులు ప్రేక్షకులు కూడా పాల్గొన బోతున్నారు. ఇక ఈయన పార్థివ దేహానికి ఈయన కొడుకు చెంబోల్ రాజా దహన సంస్కారాలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఇంతటి గొప్ప గేయ రచయితను సినీ ఇండస్ట్రీ కోల్పోయిందని చెప్పవచ్చు.