నేచురల్ స్టార్ నాని – విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా తొలి వారం కంప్లీట్ చేసుకుంది. ఈ యేడాది ఇప్పటికే జెర్సీ లాంటి క్లాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన నాని తక్కువ టైంలోనే మరోసారి గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో లక్ష్మీ, శరణ్య ఇతర పాత్రల్లో నటించారు.
ఇక వరల్డ్ వైడ్‌గా రూ.28 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన గ్యాంగ్ లీడర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.21 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక తొలి వారం కంప్లీట్ అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్లు .. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.14 కోట్లు రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఆగిపోనుంది. గ్యాంగ్ లీడర్ బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. రోజు రోజుకు నాని మార్కెట్ పడిపోతూ వస్తోంది.
గ్యాంగ్ లీడర్ ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ షేర్ (రూ.కోట్లలో)…
నైజాం – 5.81
సీడెడ్ – 1.46
వైజాగ్ – 1.91
ఈస్ట్ – 1.2
వెస్ట్ – 0.87
కృష్ణా – 1.1
గుంటూరు – 1.15
నెల్లూరు – 0.48
——————————
ఏపీ+తెలంగాణ = 13.98
——————————
రెస్టాఫ్ ఇండియా – 1.55
రెస్టాఫ్ వరల్డ్ – 3.28
వరల్డ్ వైడ్ షేర్ = 18.81