రానా ఫోటోలు.. బయటపెడుతున్న రహస్యాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దగ్గుబాటి రానా ఆరోగ్యంపై కొద్ద్దిరోజులుగా వస్తున్న వార్తలని రానా తండ్రి సురేష్ బాబు వివరణ ఇచ్చారు. రానా బాగానే ఉన్నాడని సురేష్ బాబు గట్టిగానే చెప్పారు. అయితే నిన్న జరిగిన ఓ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో రానాను చూసి అందరు షాక్ అవుతున్నారు. వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఓపెనింగ్ నిన్న రామానాయుడు స్టూడియోలో జరిగింది.

బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తున్నారు. నిన్న కార్యక్రమంలో రానా తనని ఎవరు ఫోటోలు తీయకుండా జాగ్రత్త పడ్డాడట. అంతేకాదు సినిమా రిపోర్టర్స్ ఎవరిని ఈవెంట్ కు రానివ్వకుండా నిర్మాత తరపున కొన్ని పిక్స్ అందరికి పంపించారట. అందులో రానా లాంగ్ షాట్ ఫోటో ఒకటి మాత్రమే ఉంది. ఈ లెక్కన రానా హెల్త్ ప్రాబ్లెంపై మళ్లీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈమధ్యనే గుణశేఖర్ డైరక్షన్ లో హిరణ్యకశ్యప సినిమాలో నటించబోతున్నాడని తెలుస్తుంది.

Share.