తెలుగు సినిమాలలో లేడీ కమెడిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమెడియన్ కోవై సరళ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ ఇప్పటికీ ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ఇప్పటివరకు బాగానే సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు.అయితే ఈ మధ్యకాలంలో కమెడియన్ల హవా కాస్త తగ్గడంతో కమెడియన్లకు పలు చిత్రాలలో అవకాశాలు తగ్గిపోయాయి.
ఇలాంటి సమయంలోనే కోవై సరళ సినీ ఇండస్ట్రీకి దూరమైందని ఒక కారణమని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో కోవై సరళ ఎక్కువగా రాఘవ లారెన్స్ నటించిన చిత్రాలలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంచన, ముని , గంగ చిత్రంలో ఈమె క్యారెక్టర్ చాలా హైలైట్ గా మారింది. అలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించిన కోవై సరళ.. చాలా రోజుల తర్వాత ఎవరు ఊహించని విధంగా కనపడుతోంది. ఈ ఫోటోలు చూసిన తర్వాత ఈమెకి ఏమైంది అంటూ ఆమె అభిమానుల సైతం చాలా కలవర పడుతున్నారు. అయితే ఇప్పుడు కోవై సరళ కు ఇలా ఎందుకు జరిగిందో ఒకసారి మనం తెలుసుకుందాం.
కోవై సరళ ప్రధాన పాత్రలో నటిస్తున్న సెంబి మూవీ రెండో ట్రైలర్ తాజాగా విడుదలవడం జరిగింది.ఇందులో కోవై సరళ లుక్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి రెండవ కుమార్తె ఒక పాత్ర కోసం మరీ ఇంతలా మారిపోయింది కోవై సరళ అంటూ పలు రకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ లుక్ కు కోవై సరళ తప్పకుండా ఉత్తమ నటిగా అవార్డు వస్తుందని ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ ట్రైలర్ ఒక బడుగు బలహీన వర్గాల రాజకీయ నాయకుల ఓట్ల కోసమే అన్నట్లుగా కనిపిస్తోంది . కోవై సరళ ఇలా మారడానికి కారణం కేవలం సినిమాలోని పాత్ర అన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో కం బ్యాక్ ఇస్తుందేమో చూడాలి మరి కోవై సరళ.