సర్జరీతో అసహ్యంగా మారిన మరో హీరోయిన్.. ఎవరంటే?

Google+ Pinterest LinkedIn Tumblr +

సాధారణంగా హీరోయిన్లు వారి అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి సర్జరీ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సర్జరీలు కొంతమందికి కలిసి రాకపోవచ్చు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో సర్జరీలు చేయించుకొని అవి విఫలమవడంతో అందవిహీనంగా తయారైన హీరోలు చాలామంది ఉన్నారు. అలాగే టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడాసర్జరీ చేయించుకుని దానితో ఆమె ముఖం మరింత అసహ్యం గా మారింది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని విషయములో కూడా ఇవి వార్తలు వినిపిస్తున్నాయి.బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం అంతిమ్ స్పెషల్ స్క్రీనింగ్ తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన దిశాపటాని ఎల్లో టాప్, డెనిమ్ జీన్స్ లో దర్శనమిచ్చింది. ఈ క్రమంలోనే దిశా నీ చూసిన నెటిజన్ల్ లు.. ఆమె ఫేస్ లో ఏదో తేడాగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కొందరు నెటిజన్లు అయితే ఆమె ముక్కు పెదాలకు సర్జరీ చేయించుకుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. సర్జరీతో ఏమొచ్చింది. అందంగా ఉన్న ముఖం అసహ్యంగా మార్చుకున్నావ్ అంటూ నెటిజన్లు దిశాపటానీ పై ట్రోలింగ్స్ చేస్తున్నారు.

Share.