మెగాస్టార్ పై దర్శకుడి కామెంట్స్ .. సంచలనంగా మారాయి.!

Google+ Pinterest LinkedIn Tumblr +

సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీస్ కు సంబందించిన ప్రతి విషయం సెన్సేషన్ గా మారుతుంది. పొరపాటున వారు నోరు జారితే మాత్రం ఇక రచ్చ రచ్చ చేయడం ఖాయం. ఇలానే మళయాల పరిశ్రమకు చెందిన మిస్కన్ మెగాస్టార్ మమ్ముట్టిని పొగిడే క్రమంలో అసభ్యకరంగా మాట్లాడే సరికి అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన పెరాన్భు సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు మిసిన్ నేనే ఆడపిల్లగా పుట్టి ఉంటే అతన్ని ప్రేమించే వాడిని.. అతన్ని రేప్ చేసే వాడినని అన్నారు మిస్కిన్. ఈ సినిమాలో వేరే హీరో అయితే ఓవర్ యాక్షన్ చేసే వారని అన్నాడు మిస్కిన్. అయితే అతను చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.

ఎంత హీరో ఇష్టం ఉన్నా రేప్ అన్న మాటలు ఎలా మాట్లాడుతారని. ఓ దర్శకుడై ఉండి అతని ఈ విధంగా కాంప్లిమెంట్ ఇవ్వడం ఏంటని.. అంతేకాకుండా అతను చేసిన కామెంట్స్ కు అందరు నవ్వడం ఏంటని విమర్శిస్తున్నారు.

Share.