టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మరియు సీనియర్ జర్నలిస్ట్ బీఏ జయ గారు గుండె పోటుతో నిన్న రాత్రి మృతి చెందారు. జయ ప్రముఖ టాలీవుడ్ జర్నలిస్ట్, పీఆర్ఓ బీ ఏ రాజు గారి సతీమణి. బీ ఏ రాజు గారు టాలీవుడ్ లో అనేక సినిమాలకు పీఆర్ఓ గా వ్యవహరించారు. రాజు గారు లవ్లీ, చంటిగాడు, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి చిత్రాలని కూడా నిర్మించారు. ఇక అయన సతీమణి జయ (51) తన కెరీర్ ని ఆంధ్ర జ్యోతి పత్రిక లో జర్నలిస్ట్ గా ప్రారంభించారు.
ఆమె అటు తర్వాత టాలీవుడ్ కి ప్రవేశించి బాలాదిత్య హీరోగా చంటిగాడు సినిమాకి దర్శకత్వం వహించారు. అటు తర్వాత గుండమ్మ గారి మనవడు. లవ్లీ, ప్రేమికులు, సవాల్ సినిమాలకు దర్శకురాలిగా ఆమె వ్యవహరించారు. ఆమె చివరి చిత్రం వైశాఖం. ప్రముఖ నటీమణులు శాన్వి, కామ్నా జెట్మలానీ లను తెలుగు తెరకు పరిచయం చేసింది జయ గారే. ఆమె మృతి తో తెలుగు చిత్ర పరిశ్రమ మరో సారి శోక సంద్రం లో మునిగి పోయింది.