టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నిర్మాత దిల్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తీసిన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో రేంజిలో ఉంటాయి. దాదాపు చాలా సినిమాలు సక్సెస్ కూడా అందుకున్నాయి. ఈయన కేవలం సినిమాల విషయంలోనే సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ అందుకున్నాడు… కానీ ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీల విషయంలో మీడియాలో నిలుస్తున్నారు.అయితే దిల్ రాజు ఏం చేసినా కూడా అదొక వివాదంగా మరుతోంది.
ఇదిలా ఉంటే దిల్ రాజు తీస్తున్న వారసుడు సినిమా కూడా వివాదాలకు కారణమయ్యింది. అయితే ఒకప్పుడు దిల్ రాజు తీసిన సినిమాలు సైలెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చి మంచి విజయాలను అందుకునేవి. కానీ ఇప్పుడు దిల్ రాజ్ ఏం చేసినా కూడా వివాదం అవుతోంది. అయితే సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలే కాకుండా దిల్ రాజు నిర్మించిన వారసుడు కూడా విడుదల చేయమన్నారు. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. అదేమిటంటే దిల్ రాజు తన చిత్రాన్ని తాను రిలీజ్ చేసుకుంటే తప్ప అన్నీ కూర్చొని మాట్లాడుకుందాం వివాదం చెయ్యొద్దని అంటున్నారట.
అయితే దిల్ రాజు ఒకప్పుడు హీరోల రెమ్యునరేషన్ విషయంలో మాట్లాడిన సంగతి మనకు తెలుసు. అయితే నిర్మాతలే కావాలని కొందరు హీరోలకి రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. అలాగే కొందరు హీరోలు , నిర్మాతలని కామెంట్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే అలాంటి ప్రచారం వాస్తవం కాదు. నిర్మాతలు ఏమీ అమాయకులు కాదు. హీరో మార్కెట్లో రేటును బట్టి, బడ్జెట్ లెక్కలు, అన్ని అంచనాలు వేసుకునే రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటారు. ఊరికే ఎవ్వరు ఇవ్వరు అని తెలిపారు దిల్ రాజు. అలాగే నిర్మాతగా రాణించాలి అంటే అగ్ర హీరో అయి ఉండాలి. అని ఆరోపణ పై కూడా దిల్ రాజు తీరి వినిపించారు. అయితే దిల్ రాజు రెడ్డి అయినప్పటికీ ఇండస్ట్రీలోకి రావడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు జీరో నుంచే మొదలుపెట్టాను. అయినా పెద్ద సక్సెస్ ని సాధించాను.
చాలామంది వాళ్ల తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి అల్లు అరవింద్ గారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే సురేష్ బాబు గారు, ఆయన తండ్రి వేసిన బాటలోనే అడుగు వేస్తున్నారు.