సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే అంత ఆషామాసి విషయం కాదు. అన్నిటినీ ఎదిరించి మనోధైర్యంతో ముందడుగు వేయాలి. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వారంతా కూడా ఒకప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నవారే ముఖ్యంగా సినీ పరిశ్రమలో బాడీ షేవింగ్, ట్రోలింగ్ ,అవమానాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వెండితెర పైన స్టార్డం అందుకున్న పలువురు నటీనటులు సైతం ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్న వారే. ఇందులో ముఖ్యంగా తమిళ హీరో ధనుష్ కూడా ఒకరు ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ గా తన స్టార్డం అందుకున్నారు.
దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా ఈ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇటీవల విడుదల చేసిన సార్ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇందులోని పాటలు రాయడంతో పాటు అద్భుతంగా పాడి మెప్పించారు. అయితే హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన ధనుష్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారట ముఖ్యంగా తన సినిమా సెట్ లోని యాక్టర్స్ స్టాప్ నుంచి కూడా బాడీ షేమింగ్స్ కామెంట్లు ఎదుర్కొన్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
2003 లో కాదల్ కొండేన్ సినిమా సెట్ లో తన లుక్స్ చూసి చాలామంది ఎగతాళి చేశారని.. ఆ మాటలు తనను చాలా తీవ్రంగా ప్రభావితం చేశాయని దీంతో ఒక గదిలో ఒంటరిగా కూర్చొని అలాగే ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయని ఇలా అవమానాలు ఎదుర్కోవడం ఇష్టం లేకనే ఒకసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో.. హీరో ఎవరని అడగగా మరొకరి వైపు చేయి చూపించానని ఆ తర్వాత హీరో తనే అని తెలియడంలో సెట్లో ఉన్న వారంతా నవ్వుకున్నారని.. హీరో ఆటో డ్రైవర్ల కనిపిస్తున్నారని కామెంట్లు చేశారట. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలియజేశారు ధనుష్.