డిసెంబర్ 10న శుభవార్త అంటున్న సమంత..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సమంత పెళ్లికి ముందు సినిమాలలో ఎంతో వేగంగా దూసుకుపోతూ ఉండేది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలలో కనిపించలేదనే చెప్పాలి. కానీ తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న సమంత ఏకంగా హాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. పుష్ప ది రైజ్ సినిమాలో ఆమె ఐటం సాంగ్ చేయడానికి కూడా ఒప్పుకుంది. ఇప్పుడు తాజాగా ఒక ట్వీట్ చేస్తూ డిసెంబర్ 10వ తేదీన అభిమానులకు శుభవార్త అంటూ హాష్ ట్యాగ్ కూడా చేసింది.

ఇక అసలు విషయం ఏమిటంటే.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి ఐటమ్ సాంగ్లో సమంత స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.. అయితే సిజలింగ్ అనే ఈ పాటను అభిమానుల కోసం డిసెంబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నాము అన్నట్లుగా సమంత ప్రకటించింది. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు, ప్రేక్షకులు కూడా ఈ పాట కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మొట్టమొదటిసారి ఒక ఐటం సాంగ్ లో మెరవబోతున్న సమంతను చూడటానికి ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం.

Share.