సినీ హీరో పవన్ కళ్యాణ్ 2014 లో ‘జనసేన’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆ సంవత్సరం ఎలెక్షన్స్ లో టీడీపీ, బీజెపీ కూటమికి పవన్ మద్దతు పలికారు. కానీ ఈ సారి మాత్రం జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని పవన్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర ఆంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పలువురు మేధావులు, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కలిసి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. ఈ రోజున భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల రావు పవన్ సమక్షం లో జనసేన లో చేరారు. వేణుగోపాల రావు భారత్ తరఫున 2005లో శ్రీ లంక మీద తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు, 16 మ్యాచులు భరత్ తరపున ఆడారు.
వేణుగోపాల రావు పార్టీ సభ్యత్వం తీసుకున్న సందర్భంలో పవన్ మాట్లాడుతూ జనసేన ప్రజా సమస్యల పై నిజాయితీగా పోరాటం చేస్తుందని, సమస్యల పరిష్కారమే లక్ష్యం గా పని చేస్తుందని చెప్పారు. 2019 సంవత్సరం ఆంధ్ర రాష్ట్రం లో జనసేన తప్పకుండ అధికారంలోకి వస్తుందని తెలిపారు.