తమిళ ఇండస్ట్రీలో మరోక విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన అనాధ శవంలా ఉండడం సంచలనం రేపుతోంది. ప్రముఖ నిర్మాణ సంవత్సరాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన దర్శకుడు త్యాగరాజ మరణించారు. రోడ్డు పక్కన అనాధ శవంలా పడి ఉండగా ప్రస్తుతం కలకలం రేపుతోంది.విజయ్ కాంత్ తో నటించిన సూపర్ హిట్ చిత్రం.. మానగర కవాల్ సినిమాకు ఆయనే దర్శకుడు 1991 లో విడుదలయ్యే సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ AVM నిర్ణయించింది.
అదే AVM స్టూడియో దగ్గర..రోడ్డు పక్కన అనాధగా మరణించిన ఘటన కోలీవుడ్ లో సంచలనం రేపుతోంది. వెట్రి మేల్ వెట్రీ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తన మొదటి రెండు సినిమాలు యావరేజ్ గా ఆడాయి. ఆ తర్వాత హీరో విజయ్ కాంత్ తో పనిచేసే అవకాశం అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అతనికి సినిమా ఆఫర్లు రాలేదు. ఇక త్యాగరాజు తన భార్యా పిల్లలతో గొడవల కారణంగా పదిహేనేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడు. అతని భార్య పది సంవత్సరాల క్రితమే మరణించింది. ఇక తన పిల్లలు బెంగళూరు నివాసం ఉంటున్నారు. ఈయన చిన్న గుడిసె వేసుకొని ఒకచోట ఉంటున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.