దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నడుస్తోంది. ఇందులో విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి కేవలం ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ వారం ఆర్జె కాజల్ హౌస్ నుండి బయటకు వచ్చేశారు. ఇన్ని రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చిన కాజల్ టాప్ ఫైవ్ చేరుకోలేకపోయింది. కాజల్ కు ముందు నుంచి హౌస్ లో పలు రకాలుగా నెగిటివిటీ ఎదురైనా, తాను మాత్రం ఇంత కాలం గేమ్ మీదే దృష్టి పెడుతూ వచ్చింది. ఇకపోతే మానస్ , సన్నీ లతో ఉంటున్న తీరు తనకు హౌస్ లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా సపోర్ట్ పెంచేలా చేసింది.
సన్నీ కి ఉన్న ఫ్యాన్ బేస్ కాజల్ కూడా కలిసి రావడం వలన ఆమె ఎలిమినేషన్ నుంచి తప్పించుకోగలిగారు. ఇక ఈ సారి మాత్రం కాజల్ కు తక్కువ ఓట్లు వచ్చాయని, అందుకే టాప్ ఫైవ్ చేరుకోలేక వారం ముందే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇకపోతే ఆమె వారానికి రెండు లక్షల ఒప్పందంతో హౌస్ లోకి అడుగుపెట్టింది. మొత్తం 14 వారాల గానూ రూ.30 లక్షలు అందినట్లు సమాచారం. నిజానికి 14 వారాల కు గాను రూ.28 లక్షలు అయినప్పటికీ హౌస్ లోకి వచ్చిన కొత్తలో కాజల్ కు రూ. 30 లక్షల అప్పు ఉన్నట్టు తెలిపింది. ఆమె తన అప్పు తీర్చేసి మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టే అవకాశం ఇచ్చింది బిగ్ బాస్.