భిమ్లానాయక్ సినిమా కి ముందు ఏటైటిల్ అనుకున్నారు అంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్ హీరోగా, దగ్గుబాటి రానా మరొక హీరోగా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాకి డైరెక్టర్ సాగర్ కే చంద్ర. ఈ సినిమా జనవరి 12 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ చిత్రం మలయాళ చిత్రం”అయ్యప్పనుమ్ కోషియుమ్‌” కి రీమేక్ గా రూపొందించబడింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్, రాణా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది.

ఇక ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందు ఈ సినిమాకు త్రివిక్రమ్ ముందుగా అనుకున్న టైటిల్..”అసుర సంధ్య వేళ లో” సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాలకు “ఆ” అనే అక్షరంతో నా టైటిల్ మొదలుపెడతారు అది సెంటిమెంట్ తోనే ఈ టైటిల్ ను అనుసరించాలి అన్నట్లుగా సమాచారం.

కానీ పవన్ కళ్యాణ్ కు ఉన్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్ అంతగా కనెక్ట్ కాదేమో అని నిర్మాతలు భావించడంతో ఈ సినిమా టైటిల్ లో భీమ్లా నాయక్ గా పేరు మార్చడం జరిగిందట.

Share.