రాక్షసుడు ట్రైలర్: ఈ సస్పెన్స్ శ్రీనుకు హిట్ ఇస్తుందా…

Google+ Pinterest LinkedIn Tumblr +

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ ఒక్కటి కూడా లేదు. గతేడాది చివర్లో కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన సాయి శ్రీనివాస్ ఈ యేడాది ఇప్పటికే తేజ దర్శకత్వంలో తేజ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాల్లోనూ కాజల్ అగర్వాల్ హీరోయిన్. రెండు సినిమాలు మనోడిని బాగా నిరాశకు గురి చేశారు.

భారీ బడ్జెట్ సినిమాలు.. పెద్ద డైరెక్టర్లు. స్టార్ హీరోయిన్ల కాంబినేషన్ను వదిలేసి మీడియం రేంజ్ సినిమాలు చేస్తున్నా కథలో సరైన దమ్ము లేకపోవడంతో శ్రీనివాస్కు సరైన హిట్ పడడం లేదు. తాజాగా శ్రీను నటిస్తోన్న సినిమా రాక్షసుడు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ హిట్ మూవీ రాచ్చసన్ సినిమాకు రీమేక్గా వస్తోన్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అవ్వగా ట్రైలర్ కూడా వదిలారు.

సినిమా ట్రైలర్ చూస్తుంటే పక్కా సైకో స్టోరీ ఇన్వెస్ట్గేషన్ చేసే యాక్షన్ థ్రిల్లర్గా స్పష్టమవుతోంది. వరుస హత్యలు చేస్తూ ఎవరికి దొరకని ఓ సైకో కిల్లర్ను వేటాడే పోలీస్ టీంలో హీరో ఉంటాడు. అయితే సైకో కిల్లర్ ఎలాంటి క్లూస్ ఇవ్వకుండా హత్యలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే సైకో తప్పుచేసేలా హీరో తెలివైన ఎత్తుగడ వేస్తాడు. ఈ ఎత్తుగడ ఏంటి ? చివరకు సైకో కిల్లర్ను ? ఎలా అంతమొందించారన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు రమేష్వర్మ దర్శకుడు. కోలీవుడ్ రాచ్చసన్ను మక్కికీ మక్కీ దించేస్తున్నారన్న టాక్ ఉంది. మరి ఈ సినిమాతో అయినా బెల్లంకొండకు తొలి కమర్షియల్ హిట్ దక్కుతుందేమో ? చూడాలి.

Share.