తారకరత్న పిల్లలకు అండగా నిలిచిన బాలకృష్ణ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత 23 రోజులుగా నందమూరి తారకరత్న మృత్యువుతో పోరాడి ఓడిపోయి శివైక్యం చెందారు. ఇకపోతే ఇన్నాళ్లు తారకరత్న బిడ్డలకు ధైర్యాన్ని నూరిపోసిన బాలయ్య ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు వారికి అండగా తోడుగా నిలిచారు. మధ్యలో ఏదైనా పనుండి హైదరాబాదు వచ్చినా ఆ పనులు ముగిసిన వెంటనే బెంగుళూరు ఆసుపత్రికి వెళ్లేవారు బాలయ్య. ముఖ్యంగా తారకరత్నను కాపాడుకునేందుకు బాలకృష్ణ చేయని ప్రయత్నం లేదు.. ఎంతోమంది దేవుళ్లకు పూజలు కూడా చేశారు.. హోమాలు జరిపించారు. అఖండ జ్యోతి వెలిగించారు. విదేశాల నుండి డాక్టర్లను పిలిపించి మరీ వైద్యం చేయించారు. కానీ తారకరత్న శరీరం ట్రీట్మెంట్ కు రెస్పాండ్ కాలేదు.

23 రోజులపాటు ఆసుపత్రిలో అన్ని తానే చూసుకున్నాడు బాలయ్య బిడ్డను ఆ పరిస్థితిలో చూసి ఒకవైపు బాధను పంటి కింద భరిస్తూ.. మరొకవైపు తారకరత్న భార్యాబిడ్డలకు ధైర్యం చెబుతూ వచ్చాడు.. కానీ ఎన్ని చేసినా సరే తారకరత్న మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆయన భార్య, ముగ్గురు పిల్లల సంగతి ఏంటి ? ఇంత చిన్న వయసులోనే ఎంతో ప్రేమించిన భర్తను కోల్పోయి మానసిక సంఘర్షణకు లోనైంది ఆయన భార్య అలేఖ్య రెడ్డి.. అటు పిల్లల అమాయకపు చూపులు చూస్తే మాత్రం కంటతడి పెట్టిస్తున్నాయి..

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తారకరత్న భార్య పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని బాలయ్య చెప్పినట్లు సమాచారం . ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం స్పష్టం చేశారు. ఇకపోతే ఆదివారం బాలయ్య వెళ్ళగానే తారకరత్న పెద్ద కూతురు నిషిక వెళ్లి ఆయనను కౌగిలించుకున్న తీరు చూస్తేనే వారి మధ్య బాండింగ్ ఏంటో అర్థమైపోతుంది. తాజాగా తారకరత్న పిల్లలతో బాలయ్య దిగిన ఫోటోలు ఒకటి నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది . ఏది ఏమైనా బాలయ్య వారిని కంటికి రెప్పలా చూసుకోబోతున్నట్లు సమాచారం.

 

Share.