సాధారణంగా నందమూరి నట సింహం బాలకృష్ణ విషయంలో సిని వర్గాల్లో ఒక అభిప్రాయం ఉంటుంది. ఎలాంటి సినిమా అయినా సరే తక్కువ సమయంలో పూర్తి చేస్తారని… అందరు హీరోల మాదిరిగా కథలు వింటూ నెలలు నెలలు ఆయన వృధా చేయరని… దీనితో ఆయన ఎక్కువ సినిమాలు చేస్తున్నారని, సినిమా ఫ్లాప్ హిట్ తో సంబంధం లేకుండా సినిమా చేస్తారని అంటూ ఉంటారు. చాలా కాలంగా ఈ అభిప్రాయం టాలివుడ్ లో వినపడుతూనే ఉంది. ఇక ఆయన పెద్దగా ఇబ్బందులు కూడా పెట్టరని అంటూ ఉంటారు.
ముఖ్యంగా ఆయన హీరో అయితే దర్శకుడికి ఏ ఇబ్బంది ఉండదని… తనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా బాలయ్య నటిస్తారని, పాత్ర విషయంలో కూడా ఒకటికి పది సార్లు వాదన ఉండదని అంటూ ఉంటారు. అయితే బాలకృష్ణ నిర్మాతలకు కూడా పెద్ద ఇబ్బందులు పెట్టరని అంటున్నారు… సినిమా పారితోషకం విషయంలో ఆయన పట్టుదలగా ఉండరని… ఎంత సేపు ఖర్చు తగ్గించే ప్రయత్నమే చేస్తారని అంటున్నారు. విదేశాల్లో షూటింగ్ బాలకృష్ణ ఇష్టపడరట. ఇండియాలోనే అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని,
విదేశాలకు వెళ్లి షూటింగ్ చేయడం ఎందుకు అనే భావనలో ఆయన ఉంటారట. ఇక షూటింగ్ సమయంలో కూడా ఎక్కువగా తన ఖర్చులు తానే పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారట. చాలా మంది హీరోల మాదిరి ప్రతీ రూపాయికి నిర్మాత మీద ఆధారపడరని అంటున్నారు. ఇక సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతను పిలిచి మాట్లడరతారని తర్వాతి సినిమా ఆయనతో చేయడానికి హామీ ఇస్తారని అంటున్నారు. పైసా వసూల్ సినిమా విషయంలో ఇదే జరిగిందట. ఇక సమయాన్ని కూడా ఎక్కువగా వృధా చేయరత బాలకృష్ణ.