బిగ్ బాస్ షోలో మొదటి సీజన్ లో క్రేజీ కంటెస్టంట్ అయిన ముమైత్ ఖాన్ అప్పట్లో డ్రగ్స్ కేసులో పోలీసుల ఇంటరాగేషన్ లో పాల్గొనేందుకు బిగ్ బాస్ రూల్స్ కు విరుద్ధంగా బయటకు వచ్చింది. అంతేకాదు 24 గంటల టైం లో మళ్లీ ఆమె బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చేసింది. ఆమె వెళ్లడం రావడం అంతా షోకి సెంటిమెంట్ పండించేసింది.
ఇక ఈ సీజన్ లో కూడా అలాంటి ఎపిసోడ్ ఒకటి రిపీట్ కాబోతుందని తెలుస్తుంది. అది కూడా మానవతావాది బాబు గోగినేని విషయంలో అది రిపీట్ అవుతుందని అంటున్నారు. బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ది కంటెస్టంట్ గా ఉన్న బాబు గోగినేని మీద కూడా ఈమధ్య కేసు వేయడం జరిగింది. మతాల మధ్య చిచ్చు పెట్టేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేశారని, దేశద్రోహం చేశారని బాబు గోగినేని మీద కేసు నమోదైంది. ఈ కేసు విషయమై కోర్ట్ ఈమధ్యనే నోటీసులు జారీ చేసింది.
బాబు గోగినేని బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారు కాబట్టి ఆయనకు డైరెక్ట్ గా నోటీసులు అందకున్నా బిగ్ బాస్ వాళ్ల ద్వారా ఆయన నోటీసులు అందుకునే అవకాశం ఉంది. అయితే దీనిపై వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. లేదా బిగ్ బాస్ హౌజ్ నుండి వచ్చి ఆయన విచారణలో పాల్గొనాల్సి ఉంది. మరి వీటిలో ఏం జరుగుతుందో అన్నది తెలియాలి.