ఏపీ లో టికెట్ల ధరల పై ఆర్జీవి హాట్ కామెంట్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంశాన్నయినా తనకు తప్పు అనిపిస్తే ఎటువంటి మొహమాటం లేకుండా తెలుపుతూ ఉంటాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం పై సానుకూలంగానే మాట్లాడిన వర్మ ఈ సినిమా టికెట్ల విషయంపై కాస్త అభిప్రాయని తప్పు పట్టాడు రాంగోపాల్ వర్మ.

ఇటీవల ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరను తగ్గించడం నా దృష్టిలో పూర్తిగా తప్పేనని తెలియజేశారు. టికెట్ ధరను నిర్ణయించే హక్కు ఉత్పత్తిదారులకు ఉంటుందని.. అయితే దాన్ని కొనాలా వద్దా అనేది మాత్రం వినియోగదారుడు ఇష్టం అని తెలియజేశారు. సినిమాని చూడాలనుకునేవారు టికెట్ ఎంత ఉన్నా చూస్తారని, నచ్చని వారు మానేస్తారని అది వారి ఇష్టం అని తెలియజేశారు.. సినిమా ఇండస్ట్రీ మీద ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది? లేదా? అనేది మాత్రం నాకు తెలియదు అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ముమ్మాటికీ తప్పే అని వర్మ తెలియజేశారు

Share.