ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంపై.. ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం పెద్ద ఎత్తున ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. అయితే దానికి పరిష్కారం కూడా దొరుకుతుంది అనుకున్నారు.. కానీ ఫైనల్ గా ఎలాంటి పరిష్కారం దొరకలేదు. టికెట్ల ధరలు తగ్గించడంతోపాటు.. బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి చాలా కష్టంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ ధరలు విషయంపై ప్రముఖ నిర్మాత ఏసియన్ మూవీస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది.
తెలంగాణలో టికెట్ ధరలు బాగున్నాయి.. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగోలేదని దేశమంతా ఒక వైపు వెళ్తుంది.. అప్పుడే మనం కూడా అలాగే వెళ్లాలి కదా అని సూచించారు. ఇక సినిమా టిక్కెట్లు ధరలు ఇలాగే ఉంటే నిర్మాతలకు కష్టం ఎదురవుతుందని తెలియజేశారు. ముఖ్యంగా మన దగ్గర ఉన్న అన్ని థియేటర్స్ ఎక్కడా లేవని తెలియజేశారు. ఈ విషయంపై తన మనసులో మాట ఇదే నని తెలియజేసారు.