సూపర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా సరే.. ఆ తర్వాత ఆమెకి పెద్ద సినిమాలలో ఆఫర్లు వచ్చాయి.. అలా ఒకటి రెండు సినిమాలు చేసే క్రమంలోనే రాజమౌళి సినిమా అయినా విక్రమార్కుడు సినిమాలో అవకాశం లభించి హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి తను టాప్ హీరోయిన్గా పేరు సంపాదించుకోవడమే కాదు ఇండస్ట్రీలో తానే నెంబర్ వన్ హీరోయిన్ గా చాలా కాలం పాటు కొనసాగింది.
ముఖ్యంగా అరుంధతి సినిమాతో తన ఇమేజ్ ఒక్కసారిగా స్టార్ రేంజ్ లో పెరిగిపోయింది. అక్కడి నుంచి ఆమె సెలెక్టెడ్ గా క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే బాహుబలి సీరీస్ వచ్చింది. రుద్రమదేవి కూడా అలాగే వచ్చింది.. ఆ విషయం అలా ఉంటే ప్రస్తుతం అనుష్క ఏజ్ 41 సంవత్సరాలు.. అయినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె వివాహం చేసుకోబోతోంది అంటూ ఎప్పటికప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపద్యంలో ఆమె ఇప్పుడు పెళ్లి పీటలు లెక్కబోతోంది అంటూ ఒక వార్త ఎప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది.
ఇకపోతే అనుష్క పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీగా తెలియలేదు. కానీ ఆయన ఒక పెద్ద బిజినెస్ మాన్ అనే విషయం మాత్రం బయటకు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి అయితే మరోసారి అనుష్క పెళ్లి వార్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది