హీరో నవదీప్ తెలుగు సినిమా పరిశ్రమకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ హీరో గా నిలదొక్కుకోలేకపోయింది సైడ్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. 2004 లో వచ్చిన జయం సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీ వైపు అడుగుపెట్టాడు హీరో నవదీప్. ఆ తర్వాత చందమామ సినిమాలో బాగానే అలరించిన అప్పటికీ.. తగినన్ని అవకాశాలు రాకపోవడంతో ఫెయిల్యూర్ హీరోగా మిగిలిపోయారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు ఈయన.
తాజాగా టికెట్ రేటు విషయంలో ఏపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు గురించి సినిమా ప్రముఖుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే హీరో చిరంజీవి, నిర్మాత సురేష్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలు కూడా స్పందించడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు హీరో నవదీప్ కూడా ఒక సెటైర్లు వేయడం జరిగింది..”సినిమా టికెట్ వర్సెస్ టమాట”అని ట్వీట్ చేశాడు. సినిమా టిక్కెట్ల కు సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలకు ఒకే టికెట్ ధర ఉంటుంది. మరోవైపు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సరఫరా కొరత కారణంగా టమోటా ధరలు పెరుగుతున్నాయి. ఈ రెండు అంశాలను పోలీసుల నవదీప్ ఏపీలో కిలో టమాటా ధర కంటే.. ఒక్క సినిమా టికెట్ ధర తక్కువ అని పరోక్షంగా వాఖ్యలు చేశారు అని అర్థం అవుతోంది.ఆ ట్వీట్ డిలీట్ చేసినట్లుగా కూడా సమాచారం.