Anasuya.. ఈ మధ్యకాలంలో అనసూయ (Anasuya) బుల్లితెర పైన కూడా పెద్దగా కనిపించకుండా పోవడంతో.. ఎక్కువగా పాపులారిటీ సంపాదించలేకపోతోంది. అయితే హీరోయిన్ గా ఈమె నటించాలని ఆశపడుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే వచ్చిన అవకాశాన్నల్లా సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది .తాజాగా అనసూయ రంగమార్తాండ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలోని పాత్రలు ఉంటాయని కృష్ణవంశీ తెలియజేయడం జరిగింది.
రంగమార్తాండ సినిమాలో కూడా చాలా విభిన్నమైన పాత్ర ఉంటుందని అనసూయ అభిమానులు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో వైరల్ గా మారుతోంది.ఆ వీడియోలో అనసూయ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అనసూయ రంగమార్తాండ సినిమాలో చిన్న పాత్రలో కనిపించబోతోందట. ఆ చిన్న పాత్రలో కూడా అద్భుతమైన నటులను కనబరిచినట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా రంగమార్తాండ సినిమా ఉంటుందని చాలా నమ్మకంతో తెలియజేస్తున్నారు చిత్ర బృందం. ప్రస్తుతం రంగమార్తాండ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగంగా చేయడం జరుగుతోంది .ఈ సినిమాలో నటించిన అనసూయ ఇటీవలే ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు వచ్చిన అవకాశం గొప్ప విషయం అంటూ ఆనందాన్ని తెలియజేస్తోంది.
అదే సమయంలో ఇలాంటి ఒక పాత్రను తనను ఎంపిక చేసుకున్నందుకు గాను డైరెక్టర్ కృష్ణవంశీకి కూడా కృతజ్ఞతలు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. హీరోయిన్గా కాకుండా ఇలాంటి ఒక పాత్ర చేయడం వల్ల చాలా మంచి అనుభూతి కలుగుతోందని ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు తెలియజేసింది. ప్రస్తుతం అనసూయ హీరోయిన్గా రెండు మూడు చిత్రాలు నటించినట్లు సమాచారం అయితే ఇవి అంతవరకు విడుదల అయితాయి అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. బుల్లితెర పైన మాత్రం ఇప్పటికి గుడ్ బై చెప్పేసింది అనసూయ.