పోలీసులు ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి: అనసూయ

Google+ Pinterest LinkedIn Tumblr +

యాంకర్ అనసూయ మరో సారి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఇంటికి వెళ్తున్న అనసూయకి ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ కనిపించదు. సదరు వ్యక్తి కారు లో డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ కారు నడపటం అనసూయ గమనించింది. వెంటనే దాన్ని తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసి, అతని బాగోతాన్ని బయట పెట్టింది. ఇటువంటి వారి వల్లే గతంలో మా కుటుంబం అంత కలిసి ప్రయాణిస్తున్న వాహనానికి ఒకసారి తమ తప్పు లేకపోయినా యాక్సిడెంట్ అయ్యిందని వివరించింది. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ట్రాఫిక్ పొలిసు వారిని కోరింది అనసూయ. ఇది కాస్త నెట్ లో హల్ చల్ చేయటం ప్రారంభించింది.

అనసూయ పోస్ట్ కి కొంత మంది మద్దతు తెలుపగా మరి కొంత మంది నెటిజన్స్ మాత్రం అనసూయ పై విరుచుకు పడ్డారు. కొంత మంది అనసూయని ‘ అలా వీడియో తీసే బదులు ఒక్క క్షణం కారు దిగి అతనికి చెప్పొచ్చుగా అని సలహా ఇవ్వగా..దానికి అనసూయ గతంలో ఒక చిన్న పిల్లాడిని బైక్ పై వెనకాల కూర్చోపెట్టుకుని నడుపుతూ వీడియో తీయొద్దని చెప్తే నెట్ లో చాల రచ్చ చేసారని ఘాటుగా రిప్లై చేసింది. ఇలా చాల మంది తనని ట్రాల్ చేయటం తో అనసూయ ‘ నేను చేసిన దానిలో మంచిని మాత్రమే గమనించండని నెటిజన్స్ కి వివరించింది’.

Share.